Anchor Anasuya : అతనితో లేచిపోవాలని కలలు కన్నాను అంటూ యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Anchor Anasuya : జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి నేడు సినిమాల్లో కూడా మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న వారిలో ఒకరు అనసూయ. ఈమె జబర్దస్త్ యాంకర్ గా మారకముందు కొన్ని సినిమాలు చేసింది. వాటికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్దస్త్ షో ప్రారంభం అయ్యిందో, అప్పటి నుండి ఈమె దశ తిరిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఈమె సోషల్ మీడియా లో కూడా బాగా ట్రెండింగ్ ఉండే సెలబ్రిటీ అనే విషయం మన అందరికీ తెలిసిందే.

Anchor Anasuya
Anchor Anasuya

నిత్యం యాక్టీవ్ గా ఉండే పలు సంఘటనలపై కామెంట్స్ చేస్తూ అప్పుడప్పుడు బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ గురించి ఈమె చేసిన కామెంట్స్ ఎలా ఉండేవో మనమంతా చూసాము. ఇదంతా పక్కన పెడితే సుశాంక్ ని పెళ్లి చేసుకోకముందు తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది అనసూయ.

Anchor Anasuya Updates

ఆమె మాట్లాడుతూ ‘సుశాంక్ తో పెళ్ళికి ముందు ఇంట్లో నాకు సంబంధాలు చూసారు. అమ్మ నాన్నలకు ఒక పైలెట్ సంబంధం బాగా నచ్చింది. దాదాపుగా ఆ సంబంధం కి ఓకే చెప్పేయబోయారు ఇంట్లో. ఆ సమయం లో నేను మా అమ్మ ద్వారా మా ప్రేమ గురించి నాన్న కి తెలిసేలా చేశాను. నాన్న అందుకు ఒప్పుకోలేదు. దీంతో నేను సుశాంక్ తో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈ విషయం మా నాన్న కి తెలిసి, నాన్న బాగా కొట్టి ఇంట్లో నుండి బయటకి గెంటేసాడు.

- Advertisement -
Anchor Anasuya Husband

అప్పుడు సుశాంక్ వద్దకి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడిగితే అతను ఊపుకోలేదు. ఇంట్లో వాళ్లకు చెప్పి చేసుకుంటేనే గౌరవం, మర్యాద ఉంటుంది. మర్యాద తక్కువ పనులు మనం చెయ్యవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి మా నాన్న ఒప్పుకున్నాడు, పెళ్లిచేసుకున్నాం. పెళ్ళైన 9 ఏళ్లకు సుశాంక్ ని మా నాన్న అల్లుడిగా అంగీకరించాడు’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here