Anchor Anasuya : అందుకే తెలుగులో మాట్లాడడం కష్టంగా ఉంటుంది

- Advertisement -

Anchor Anasuya : అనసూయ భరద్వాజ్ (Anasuya) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తరచూ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ తనకు తెలుగు మాట్లాడడం ఎందుకు కష్టంగా ఉంటుందో తెలిపింది.

Anchor Anasuya
Anchor Anasuya

తాను చిన్నప్పటి నుంచి ఇంగ్లిషు మీడియంలో చదవడం వల్ల తెలుగు మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. 5 తరగతి నుంచి ఇంగ్లిషులోనే మాట్లాడడం వల్ల తనకు అదీ బాగా అలవాటు అయిపోయిందని అన్నది. అన్ని సంవత్సరాల నుంచి వస్తోన్న అలవాటు ఒక్కసారిగా మార్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుందని పేర్కొంది. స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంగ్లిషులో మాట్లాడకపోతే ఇంపోజిషన్ రాయించేవారని చెప్పింది. న్యూస్ ఛానలల్లో పనిచేయడం వల్ల ఇలాగైనా తెలుగు మాట్లాడ గలుగుతున్నానని అన్నది. ఇంట్లో కూడా ఎక్కువ శాతం ఇంగ్లిషులోనే మాట్లాడతుందని తెలిపింది.

Anchor Anasuya  Photos

తన సినిమాల విషయానికొస్తే.. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ (rangamarthanda) సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో నటనకు అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం అనసూయ (Anasuya) పుష్ప 2 (pushpa2), అరి సహా పలు సినిమాల్లో నటిస్తోంది. అందులోని పాత్రలు ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని చెబుతోంది. ఇక ప్రస్తుతం అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. అందుకే తనకు ఎంతో పేరు తీసుకొచ్చిన జబర్ధస్త్‌‌ కూడా గుడ్ బై చెప్పేసింది. పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన అనసూయ (Anasuya).. గతేడాది చిరు ‘గాడ్ ఫాదర్’ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో కనువిందు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here