Anasuya : వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. ప్రస్తుతం నటిగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. సినిమాలే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ ఆమె చురుగ్గా ఉంటారు. ఇక ఆమెకు సోషల్ మీడియోలో ఉండే ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికితే చాలు.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు, ఫొటోలు షేర్ చేస్తూ.. అనేక విషయాలపైనా తన స్పందన తెలియజేస్తారు. ఆదివారం సెలవు కావడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

తన గ్లామర్‌తో తన అందాల ఫాలోవర్లకు, అభిమానులకు అందాల విందిస్తూ ఎప్పటికప్పుడూ సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు అనసూయ. దీంతో ఆమెను కొందరూ ప్రశంసించే వారైతే మరికొందరు అనసూయను విమర్శిస్తూ తెగ ట్రోల్స్ చేస్తుంటారు. ఇటీవలే తాను పోస్ట్ చేసిన ఫొటోలకు ‘పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న మీకు ఇదంతా అవసరమా ఆంటీ..?’ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అలా ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నవారికి ఆమె కౌంటరిస్తుంటారు. అయినా సరే అనసూయపై ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

అంతేకాకుండా సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ దొరికినట్లయితే ఫ్యామిలీతో వేరువేరు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అనసూయ ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్ మూడ్ లో ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియజేస్తూ, తన డే ఎలా ప్రారంభమవుతుంది? ఎలా ముగిస్తుంది? అనే విషయాన్ని అభిమానులకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అనసూయకు హెల్దీ బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా ఇష్టమట. నిద్ర కూడా బాగా ఇష్టమని తెలిపింది. తను ప్రతిరోజు రాత్రి నిద్ర పోయేది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసమే అంటూ ఆమె తెలియజేసింది. ఎర్లీ మార్నింగ్ లుక్కుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె అభిమానులకు షేర్ చేసింది.