Anasuya: యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. న్యూస్ రీడర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనసూయ అతి కొద్ది కాలంలోనే తనకు ఇష్టమైన సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేసి తన సత్తా చాటుతోంది.. ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు జబర్దస్త్ యాంకర్ గా సంపాదించుకుంది అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ.. తాజాగా ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ.. తన అభిమానులు వేసిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది అనసూయ..
అందులో భాగంగా అనసూయ ను ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మీకు ఎందుకు అంత కోపం వస్తుంది అని అడగగా.. అనసూయ ఆ ప్రశ్నకు సమాధానంగా.. ఎందుకంటే వాళ్ళ అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి.. ఎనీవే.. ఇప్పుడు కోపం రావడం లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాను.. నేను నా లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ.. మంచి మంచి పనులు చేసుకుంటూ అలాంటి వాళ్లకి సరైన గుణపాఠం చెబుతున్నాను అంటూ నెటిజన్ వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అనసూయ.
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆంటీ పిలుపు వెనుక మాల ఇన్ని అర్థాలు ఉన్నాయా.. ఆంటీ అని పిలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని అనసూయకి తెలుసు. అందుకే తనని ఆంటీ అని పిలిస్తే అందుకే ఖండిస్తుంది అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.
ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. పుష్ప 2లో నటించనుంది. అంతేకాకుండా మరికొన్ని క్రేజీ ఆఫర్స్ ను కూడా సొంతం చేసుకుంది.