Anasuya : హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టి తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. కేవలం తనను ఉద్దేశించి మాత్రమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే.. అందాల అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేవేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీల్లో రెచ్చిపోయి రచ్చ చేస్తూ.. ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో గొడవ గురించి చెప్పాల్సిన పనిలేదు.

బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ముద్దుగుమ్మ. తర్వాత ఈమెకు సినిమాల్లో అవకాశం రావడంతో యాంకరింగ్‌కు గుడ్ బై చెప్పి నటినతో తన సత్తా చాటుతోంది. సినిమాల్లో అనసూయ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈమె విలన్ రోల్‌లో ఆ పాత్రకు తగ్గట్టుగా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప2లో దాక్షయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా, ఓ దర్శుకుడిపై నిప్పులు చెరిగింది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అబ్బాయిలు, అక్క విషయంలో అలా.. భార్య విషయంలో ఇలా ఉంటారంటూ ఫైర్ అయ్యింది. ఇదే హైపోక్రసీ(కపటత్వం).. మీరు నన్ను హిపోక్రైట్ అంటారా? అని కామెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీలో హీరో తండ్రి తన సొంత బావను చంపేస్తాడు. తర్వాత అక్కకు మరో పెళ్లి చేయమంటాడు. కానీ రణ్‌బీర్ కపూర్ యుద్ధానికి వెళ్తూ నేను వస్తానో లేదో తెలియదు. నువ్వు రెండో పెళ్లి మాత్రం చేసుకోకని చెప్తాడు. దీని మీదే అనసూయ డైరెక్టర్‌కు కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేసింది.