Anasuya : ఆ కోరికతో కాలేజీ రోజుల్లోనే రూ.500 అయినా అనసూయ ఓకే అనేసిందట

- Advertisement -

Anasuya : టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామెడీ షో జబర్దస్త్ వేదికగా ఆమెకు భారీ పాపులారిటీ దక్కింది. 2013లో మొదలైన జబర్దస్త్ కామెడీ షో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. జబర్దస్త్ షో లో అనసూయ పాత్ర ఎంత ఉన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పొట్టి గౌన్లు వేసుకుని అందాలు ఆరబోస్తూ జబర్దస్త్ ను ఒక ఊపు ఊపేసింది. అంతే కాదు ఆమె డ్రెస్ ల వల్ల అనేక విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా కెరీర్ కోసం తప్పదని ఆమె ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తుంది.

ఇది ఇలా ఉంటే ఆమె కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. అనసూయకు ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. 2003లో ఎన్టీఆర్ హీరోగా సదా హీరోయిన్ గా పొలిటికల్ థ్రిల్లర్ నాగా సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అప్పుడు అనసూయ వయస్సు కేవలం 19 ఏళ్లు. ఈ పాత్ర కోసం ఈ హాట్ బ్యూటీ రెమ్యునరేషన్‌గా కేవలం రూ. 500 మాత్రమే తీసుకుందట. కానీ ఇప్పుడు అనసూయ రెమ్యునరేషన్ కోట్లలో తీసుకుంటుంది. ఈ వార్త విన్న జనాలు అనసూయ రియల్లీ గ్రేట్. ఆదర్శవంతమైన మహిళ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. స్టేజీపై యాంకరింగ్ చేస్తూ ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. ఈ హాట్ బ్యాూటీ గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. నెటిజన్లు ఎన్ని రకాల నెటిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. తన లైఫ్ స్టైల్ తను కొనసాగిస్తుంది. ప్రస్తుతం అనసూయ వెండితెరపై స్టార్ నటిగా గుర్తింపు దక్కించుకుంది. ‘విమానం, పుష్ప, రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here