Anasuya భరద్వాజ్.. ఈపేరు తెలియని తెలుగు కుర్రాడు ఉండడు. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా ఈ భామ అందం ఇంకా చెక్కుచెదరలేదు. బ్యూటీ ట్రీట్ కు ఏమాత్రం నో చెప్పకుండా తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. దానివల్ల తరచూ ట్రోలింగ్ కు గురైతూ ఉంటుంది.
సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్. తరచూ తనకు సంబంధించిన ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా పలు విషయాలపై స్పందిస్తూ అప్పుడప్పుడు అది కాస్త మిస్ ఫైర్ అయి నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతుంది.
తాజాగా అనసూయ రెడ్ కలర్ చీరలో మెరిసింది. రంగమార్తాండ సినిమా ప్రమోషన్స్ లో ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో కనిపించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా శారీలో చేసిన ఫోటోషూట్ పిక్స్‌ని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అనసూయ రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్లో చిరునవ్వులు చిందిస్తూ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కొందరు నెటిజన్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. చీరకట్టులో ఈ భామ అందం మామూలుగా లేదంటూ పొగుడుతున్నారు. పొట్టిబట్టల్లో కంటే చీరలోనే అందంగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరికొందరేమో అనసూయ షేర్ చేసిన ఫొటోల కింద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. తల్లి ఎలా ఉండాలో కాజల్ ను చూసి నేర్చుకోవాలంటూ సెటైర్ వేస్తున్నారు. దాదాపు అనసూయ ఇలాంటి సెటైర్లకు వెంటనే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు తన డ్రెస్సింగ్ స్టైల్ పై వచ్చిన కామెంట్స్ ను ఈ బ్యూటీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.
ఇక ఈ భామ బుల్లితెరపై యాంకర్ గా బిజీగా ఉంటూనే సినిమాల్లోనూ నటిస్తోంది. కాకపోతే ఈ మధ్య తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టింది. ఓవైపు పుష్ప-2 షూటింగులో బిజీగా ఉంటూనే మరోవైపు రంగమార్తాండ సినిమాలో నటించింది. ఈ సినిమా ఉగాది పండుగ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ కోడలిగా మోడ్రన్ లేడీగా అనసూయ యాక్ట్ చేసింది.