Allu Arjun : సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట వైరల్ అవుతుండటం చూస్తున్నాం. ఒకప్పటి కామెంట్స్ కూడా టైం చూసి బయటపెడుతుంటారు కొందరు. ఇదే బాటలో అల్లు అర్జున్‌పై అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్ ఇష్యూగా మారింది. అనసూయ ముక్కుసూటి మనిషి అని మనందరికీ తెలుసు. జబర్దస్త్ బ్యూటీగా ఎంతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయింది. మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు కూడా చేసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీ కూడా చేస్తోంది. ఈ సినిమాలో దాక్షాయణిగా పవర్ ఫుల్ రోల్ పోషిస్తోంది. మరి అలాంటి అనసూయ అల్లు అర్జున్‌పై ఒకప్పుడు ఎలా రియాక్ట్ అయింది? గంగోత్రి సినిమా సమయంలో బన్నీపై ఆమె ఫీలింగ్స్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు మరోసారి బయటకు తీసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ పై అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? గంగోత్రి మూవీ చూసి అసలు మనవాళ్లకి ఏమైంది అనుకున్నా.. బీ ఫ్రాంక్.. మీరందరూ అదే అనుకోని ఉంటారు.

అల్లు అర్జున్ లంగా ఓణీ వేసి చేసిన పాట అయితే అబ్బో..! అంటూ రియాక్ట్ అయింది అనసూయ. నిజానికి ఇది చాలా ఓల్డ్ వీడియో. ఆ తర్వాత దీనిపై వివరణ కూడా ఇచ్చింది అనసూయ. అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చి అని, ఆయన డాన్స్ మూమెంట్స్ తనకు చాలా ఇష్టమని కూడా చెప్పింది. కాకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియోతో దుమారం మొదలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, తన గ్లామర్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడం యాంకర్ అనసూయకు కొత్తేమీ కాదు. ఎవరేమనుకున్నా, తన డ్రెస్సింగ్ గురించి ఎన్నో ట్రోల్స్ నడిచినా అస్సలు లెక్క చేయదు ఈ జబర్దస్త్ బ్యూటీ. జబర్దస్త్ బ్యూటీగా భారీ పాపులారిటీ సంపాదించింది అనసూయ.