Anasuya Bharadwaj .. ఈ భామ యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వెండితెరపై అరంగేట్రం చేసింది. ఈ బ్యూటీ తన అందం, డ్రెస్సింగ్ స్టైల్‌తో బాగా పాపులర్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు.. కాదు.. చాలా సార్లు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ ఏ ట్వీట్ చేసినా.. ఈ మధ్య కాంట్రవర్సీ అవుతోంది. అలా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనసూయ.

ఇటీవలే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మొదలైన గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిన ఈ భామ ఆ తర్వాత తన భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లింది. అక్కడ తన బికినీ ధరించి.. ఆ ఫొటోలు కాస్త నెట్టింట పోస్టు చేయడంతో ట్రోలింగ్‌కు గురైంది. ఇప్పుడు మరోసారి ఓ ట్వీట్ చేసి నెట్టింట మళ్లీ దుమారం లేపింది అనసూయ. ఇంతకీ ఈసారి ఈ భామ చేసిన ట్వీట్ ఏంటో.. ఎవరిని టార్గెట్ చేసిందో.. ఓసారి చూసేద్దామా..?
‘నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు’ అంటూ అనసూయ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. ఈ భామ ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అందో.. మళ్లీ ఎవరిని టార్గెట్ చేస్తోందో.. అని నెటిజన్లు తల పట్టుకుంటున్నారు. ఆంటీ.. ఈసారి ఎవరిపైన మీ కోపం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీకు కోపం తెప్పించింది ఎవరూ అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

‘మళ్లీ ఏమైంది మేడమ్?’, ‘మిమ్మల్ని ఎవరు ఏమన్నారు?’ అని అడుగుతున్నారు. ఇంతకీ అనసూయ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘‘వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైనదాన్ని. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంటే.. నాపై అంత డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు’’ అని ట్వీట్ చేసింది ఈ భామ.
ఇంతకుముందు పలు సందర్భాల్లో అనసూయ పరోక్షంగా పెట్టిన ట్వీట్‌లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ విజయ్ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్ విడుదలకాగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన అనసూయకు విజయ్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. సినిమా పోస్టర్/ ప్రచార చిత్రాలు వచ్చినప్పుడు, సినిమాలు విడుదలైన రోజు అనసూయ ట్వీట్ చేస్తుండడం గమనార్హం. కానీ ఈసారి ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో మాత్రం ఎవరికీ అంతు చిక్కడం లేదు.