Anasuya Bharadwaj : పొగరుతో పవన్ కళ్యాణ్ కి ‘నో’ చెప్పిన యాంకర్ అనసూయ..కారణం అదేనా?

- Advertisement -

Anasuya Bharadwaj : బుల్లితెర పై స్టార్ యాంకర్ గా కొనసాగిన యాంకర్ అనసూయ కి ఎంత పాపులారిటీ మరియు క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ రేంజ్ గ్లామర్ తో మెరిసిపోయే అనసూయ, కేవలం యాంకరింగ్ రంగం లో మాత్రమే కాదు, సినిమాల్లో కూడా అద్భుతంగా రాణించింది. విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఈమెకి దక్కిన గుర్తింపు ఏ స్టార్ యాంకర్ కి కూడా దక్కలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

కేవలం సినిమాలు, టీవీ మీద మాత్రమే కాదు, సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఈమె. ఆమె పెట్టే ఫోటోలపై విమర్శలు కూడా వస్తుంటాయి, కానీ ఆమె అవేమి పట్టించుకోదు. పైగా తనపై వచ్చే నెగటివ్ కామెంట్స్ పై చాలా తీవ్రంగా స్పందించి యాక్షన్ కూడా తీసుకుంటూ ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే అనసూయ కి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా చెయ్యడానికి ఇష్టపడలేదట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ‘ఇట్స్ టైం టూ పార్టీ’ అనే ఐటెం సాంగ్ ఉంటుంది కదా, ఇందులో అనసూయ చెయ్యాల్సింది అట.

- Advertisement -

నేరుగా త్రివిక్రమ్ ఈ ఆఫర్ ఇచ్చినా ఆమె వదులుకుంది అట. కారణం ఆ పాటలో ఆమెతో పాటు చాలా మంది హీరోయిన్స్ ఉండడమే. నేను మాత్రమే ప్రధానంగా ఫోకస్ అయ్యే పాత్రలు చేస్తాను కానీ, ఇలా గుంపులో గోవిందా లాగ నలుగురిలో ఒకరిగా ఉండలేనని, ఈ సినిమా చెయ్యలేను దయచేసి ఏమి అనుకోకండి అంటూ త్రివిక్రమ్ కి మెసేజి పెట్టిందట అనసూయ. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here