Tantra Movie : ఈవిల్ డెడ్ లాంటి హారర్ సినిమాలని రిలీజ్ చేసే సమయంలో… మా సినిమాని ఒంటరిగా చూస్తే ప్రైజ్ మనీ ఇస్తాం, ఒంటరిగా మా సినిమా చూడకండి లాంటి ప్రమోషనల్ స్టంట్ లు ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి బయటకి వస్తుంటాయి. ఇలాంటి ప్రమోషన్స్ కారణంగా సినిమాకి మరింత పబ్లిసిటీ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతూ ఏ హారర్ సినిమా మేకర్ పబ్లిసిటీ చేయట్లేదు. లేటెస్ట్ గా తెలుగులో ఇలాంటి ప్రమోషనల్ స్ట్రాటజీ ఫాలో అవుతూ సినిమాకి పబ్లిసిటీ చేసుకుంటున్నారు తంత్ర ఫిల్మ్ మేకర్స్.

అనన్య నాగల్ల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికేట్ లభించింది. దీంతో చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ పిల్ల బచ్చా ఆడియన్స్ థియేటర్ కి రాకండి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ తంత్ర చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని చెప్పేస్తున్నారు. ఇలాంటి ప్రమోషనల్ స్టంట్ క్లిక్ అయితే సినిమాకి సాలిడ్ పబ్లిసిటీ వచ్చేస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ తంత్ర సినిమాని పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ఇదే జాగ్రత్త విషయంలో కూడా తీసుకోని ఉంటే మాత్రం తంత్ర సినిమా… ఈమధ్య కాలంలో వచ్చిన మంగళవారం, పొలిమేర 2, మసూద లాంటి హిట్ సినిమాల లిస్టులో చేరిపోతుంది.