Ananya Nagalla : నేను వాటికి సర్జరీ చేయించుకున్నాను.. షాకిచ్చిన అనన్యా నాగళ్ల..

- Advertisement -

Ananya Nagalla : ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తంత్ర. మార్చి 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ ప్యాంట్ తడిసిపోయేలా భయపెట్టాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనన్య.

Ananya Nagalla
Ananya Nagalla

వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా ఈ చిన్నది .. దావత్ అనే షోలో పాల్గొంది. అందులో తన సర్జరీకి సంబంధించిన విషయాలను పంచుకుంది. ప్రస్తుత ఇండస్ట్రీలో హీరోయిన్లు.. తమ గ్లామర్ ను కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు అన్న విషయం తెల్సిందే. మీరెప్పుడైనా అలాంటి సర్జరీ చేయించుకున్నారా.. ? అన్న ప్రశ్నకు అనన్య నిర్మొహమాటంగా అవును చేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది.

‘‘నేను లిప్ ఫిల్లర్ వేయించాను. అది వేసి రెండేళ్లు అవుతుంది.ఇప్పుడు పోయినట్టుంది” అని చెప్పుకొచ్చింది. లిప్ ఫిల్లర్ అంటే .. పెదాలు షేప్ వచ్చేలా చేస్తారు. ఇక ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి కూడా అనన్య మాట్లాడింది. కార్లు, అసిస్టెంట్లు ఉంటే వేరేవిధంగా చూస్తారని, అవి లేకపోతే పట్టించుకోరని చెప్పింది. సమంత, అలియా భట్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన అనన్య.. హిట్ అందుకున్నాకా అందరూ తనను గుర్తుపట్టి మాట్లాడతారు అనుకున్నాను అని, కానీ ఆ హ్యాపినెస్ బయట కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here