Ananya Nagalla : అనన్య నాగళ్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిలో బాగా నటించి తానేంటో నిరూపించుకుంది. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ బ్యూటీ. తన అందం, అభినయంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే అనన్యకు మంచి పేరు తెచ్చింది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. బలమైన పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనన్య మరోసారి ‘తంత్ర’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తనకు బాయ్‌ఫ్రెండ్ లేడని అనన్య నాగళ్ల.. తనకు ప్రేమ వివాహమా లేక కుదిరిన వివాహమా అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని స్పష్టం చేశారు. నేను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నేను ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోను. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెళ్లయ్యాక భార్యపై ప్రేమను కోల్పోతారు. ఇండస్ట్రీలో వివాహేతర సంబంధాలు కూడా సర్వసాధారణం. పెళ్లయ్యాక దాన్ని వాడుకుని వదిలేస్తారు. అందుకే ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే ఇక్కడ కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. వారి ఆలోచన, పరిపక్వత, జీవితం పట్ల అవగాహన అన్నీ భిన్నంగా ఉంటాయి. ఈ తరానికి అవేవీ లేవు’ అని అనన్య అన్నారు.

తనకు అంత నమ్మకం లేదని అనన్య చెప్పింది. నేటి యువతలో ఎలాంటి సీరియస్‌నెస్ లేదంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని ముక్తసరిగా చెప్పింది. తన కాబోయే వరుడు ఎలా ఉండాలో కూడా అనన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. కచ్చితంగా గెడ్డం ఉండాలని.. ఎత్తు, రంగు గురించి పెద్దగా పట్టించుకోనని, నిజాయితీగా ఉంటే చాలని చెప్పింది. ఇక అనన్య తాజా చిత్రం ‘తంత్ర’ మార్చి 15న భారీ స్క్రీన్‌లపై విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.