anantha sriram : సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దొడ్డిపట్ల తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి. ఇకపోతే బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన మూడో సంవత్సరం చదువుతుండగానే పాటలపై మక్కువ పెరిగింది. ఇక ప్రముఖ రాజకీయ నాయకుడు చేగొండి హరి రామ జోగయ్య అనంత శ్రీరామ్ కు వరుసకు పెదనాన్న అవుతాడు. 12 ఏళ్ళ వయసులోనే పాటలు రాయడం ప్రారంభించిన అనంత శ్రీరామ్ 2014 వరకు 195 చిత్రాలకు గాను 558 పాటలు రాశాడు.
ఇప్పుడు ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ షోలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్న ఈయన తాజాగా సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కి కూడా న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సింగర్ గీతామాధురితో కలిసి ఓంకార్ హోస్టుగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు అనంత శ్రీరామ్ ఆ తర్వాత అక్కడ ఉన్న ఫారిన్ సింగర్ తో పాటలు పాడి అలరించాడు అనంతరం వారు అనంత శ్రీరామ్ ను హగ్ చేసుకోగా వెంటనే ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆనందంతో తెగ డాన్స్ వేసేసాడు.
ఇక తర్వాత గీతామాధురి అనంత శ్రీరామ్ జై బాలయ్య పాటకు స్టెప్పులేశారు. మొత్తానికి అయితే అనంత శ్రీరామ్ ఎప్పుడూ ఆడవాసనే తగలనట్టు మెలికలు తిరిగిపోయాడు. తర్వాత ఎమోషనల్ స్పీచ్ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న అనంత శ్రీరామ్ ఓంకార్ పెట్టిన టాస్క్లలో పాల్గొని మరొకసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికైతే సిక్స్త్ సెన్స్ ప్రోమో కాస్త బాగా ఆకట్టుకుంటుంది త్వరలోనే ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కానుంది.