ఇదే జరిగితే విజయ్ దేవరకొండను ఆనంద్ దేవరకొండ తొక్కేయడం ఖాయం..

- Advertisement -

సాధారణంగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లకు సినిమా ఇండస్ట్రీలో చాలా త్వరగా అవకాశాలు వచ్చాయి. అయితే విజయం మాత్రం అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఓర్పుతో పాటు పట్టుదల అవసరం. అలా టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ స్టార్‌ హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, డియర్‌ కామ్రేడ్‌, లైగర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కూడా విజయ్‌ బాటలోనే అడుగులు వేస్తున్నాడు.

ఆనంద్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ

ఇటీవల అతను నటించిన బేబీ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బేబీ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆనంద్ దేవరకొండకు మంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. బడా నిర్మాణ సంస్థలు సైతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ‘స్టూడియో గ్రీన్ ప్రముఖ బ్యానర్లు ఆనంద్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. ‘పుష్ప’, ‘ఉప్పెన’, ‘వీరసింహా రెడ్డి’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను నిర్మించింది. అందుకే ఈ సంస్థతో పనిచేయాలని చాలామంది హీరోలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండకు అలాంటి ఛాన్స్ వచ్చింది.

Anand Deverakonda

దర్శకుడు వినోద్‌, ఆనంద్‌ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమాను నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్‌ ముందుకొచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్‌లో భారీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ‘స్టూడియో గ్రీన్’ నిలుస్తోంది. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ కొత్త సినిమాను నిర్మించేందుకు ‘స్టూడియో గ్రీన్’ అధినేత జ్ఞానవేల్ రాజా ఆసక్తి చూపిస్తున్ననట్లు సమాచారం. ఇదే జరిగితే విజయ్ దేవరకొండను ఆనంద్ దేవరకొండ తొక్కేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘బేబీ’ సూపర్ హిట్ కావడంతో ఆనంద్ దేవరకొండకు అదృష్టం తలుపులు తెరుచుకున్నాయని చెప్పొచ్చు. మెగాస్టార్‌ చిరంజీవి, రష్మిక మందన్న, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ‘బేబీ’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here