నటినటులు:సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న, శరణ్య ప్రదీప్.
దర్శకత్వం:దుష్యంత్ కటికనేని
నిర్మాత:ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్ (సమర్పకుడు), వెంకటేష్ మహా (సమర్పకుడు)
సంగీతం:శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ:వాజిద్ బేగ్
Ambajipeta Marriage Band యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత తన టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న నటుడు సుహాస్. ఈయన ఒక మంచి కమెడియన్ గా టాలీవుడ్ లో కొనసాగాడు. అదే సమయం లో హీరో గా కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆయన హీరో గా నటించిన ‘కలర్ ఫోటో’ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనం కళ్లారా చూసాము. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘రైటర్ పద్మభూషణ్’ అనే చిత్రం లో కూడా హీరోగా నటించి మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలకు మధ్యలో ఆయన పలు సినిమాల్లో కమెడియన్ గా చేసాడు, పలు సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. అలా అన్నీ రకాల పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సుహాస్ ఇప్పుడు లేటెస్ట్ ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ అనే సినిమాలో హీరో గా నటించాడు. ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
అంబాజీపేట అనే ఒక చిన్న గ్రామం లో మల్లి(సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) అనే అక్కాతమ్ముళ్లు ఉంటారు. చాలా సాధారణమైన మధ్య తరగతి జీవితాన్ని గడుపుతూ అలా కాలం ని కొనసాగిస్తారు. ఆ ఊరిలో వెంకట్ అనే కోటీశ్వరుడు అందరికీ అప్పులు ఇచ్చి తన గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అతనికి లక్ష్మీ(శివాని నాగారం) అనే చెల్లెలు ఉంటుంది. ఈమె అంబాజీ మ్యారేజ్ బ్యాండ్ లో పని చేసే మల్లి తో ప్రేమలో పడుతుంది. అయితే మొదటి నుండి వెంకట్, పద్మ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అలాంటి సమయం లో ఒకరోజు వెంకట్ కి తన చెల్లి లక్ష్మి మల్లితో ప్రేమలో ఉంది అనే విషయం తెలుస్తుంది. దీంతో పగతో రగిలిపోయిన వెంకట్, ఇదే అదునుగా తీసుకొని పద్మని చాలా ఘోరంగా అవమానిస్తాడు. అక్కడి నుండి ఈ ఊరి కథ ఎలా మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్ళింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ కథ 2007 వ సంవత్సరం లో జరుగుతుంది. అప్పటి వాతావరణం కి తగ్గట్టుగా డైరెక్టర్ కథని ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకు పోయాడు. కథలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నా, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ని అద్భుతంగా పండించడంలో డైరెక్టర్ సక్సెస్ అవ్వడం తో సినిమా బ్లాక్ బస్టర్ అని మనకి అక్కడే అర్థ అయిపోతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ కి అదిరిపోయే రేంజ్ థియేట్రికల్ అనుభూతిని అందించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఎత్తు, ఇంటర్వెల్ సన్నివేశం ఒక ఎత్తు అనే విధంగా చూసే ప్రతీ ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కి కావాల్సినంత కథ, ఎమోషన్ ఉందని మనకి అర్థం అయిపోతుంది. దానికి తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ ని నడిపించాడు డైరెక్టర్. ముఖ్యంగా శరణ్య ప్రదీప్ పాత్ర సెకండ్ హాఫ్ లో హీరో క్యారక్టర్ ని డామినేట్ చేసింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ సినిమాలో హీరో క్యారక్టర్ కంటే ముందుగా హీరో కి అక్క క్యారక్టర్ చేసిన శరణ్య ప్రదీప్ గురించి మాట్లాడుకోవాలి. ఈమెలో ఇంత టాలెంట్ ఉంది అనే విషయం ఈ చిత్రం చూసిన తర్వాతనే అందరికీ అర్థం అయ్యింది. ఫిదా సినిమా తర్వాత ఆమె పలు చిత్రాలలో నటించింది కానీ, పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. కానీ ఈ సినిమాలో ఆమె పోషించిన పద్మ అనే క్యారక్టర్ మాత్రం కొనేళ్లు అలా గుర్తుండిపోతుంది. ఇక హీరో సుహాస్ ఎప్పటి లాగానే ఈ సినిమాలో కూడా సితారమైన నటన తో అద్భుతంగా మెప్పించాడు. కొత్త హీరోయిన్ శివాని నాగారం కూడా తన పరిధిమేర చక్కగా నటించింది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర అందించిన సంగీతం చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. పాటలతో పాటుగా, సందర్భానికి తగ్గట్టుగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేక సన్నివేశాలకు బాగా ప్లస్ అయ్యింది. ఇక డైరెక్టర్ దుశ్యంత్ ఈ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా చేరిపోతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చివరి మాట :
ఇప్పటి వరకు సుహాస్ హీరోగా చేసిన సినిమాలలో ఈ చిత్రాన్ని ది బెస్ట్ అని చెప్పొచ్చు. కచ్చితంగా థియేటర్స్ లో చూడదగ్గ సినిమా.
రేటింగ్ : 3/5