Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు అమర్ దీప్ భార్య తేజస్విని ఎందుకు ప్రియాంక జైన్ ని అసలు పట్టించుకోలేదు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే తేజస్విని మరియు ప్రియాంక ఇద్దరూ కూడా బయట మంచి స్నేహితులు, వీళ్ళు కలిసి షాపింగ్స్ కి వెళ్లడం, వీడియోలు చెయ్యడం వంటివి మనం చాలానే చూసాము.
అంత మంచి స్నేహం ఉన్నప్పటికీ ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో అసలు మాట్లాడలేదు , ఇది చాలా తప్పు కదా అని అమర్ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక చేసిన పనిని చూసి షాక్ కి గురై తేజస్విని ఎందుకు అలా ప్రవర్తించిందో ఇప్పుడు అర్థం అయ్యిందని అమర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గౌతమ్ తనని కెప్టెన్ ని చేసాడు కాబట్టి, ఆయనకీ ఈమె పాయింట్స్ ఇవ్వాలి అనుకోవడం లో ఎలాంటి తప్పు లేదు.
కానీ అర్జున్ కి ఇవ్వాలని అనుకోవడం చాలా తప్పు. మొదటి వారం నుండి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడైన అమర్ దీప్ కనీసం తనకి రెండవ ఛాయస్ గా కూడా కనిపించలేదా అని అమర్ ఫ్యాన్స్ ఎంతగానో ఫీల్ అయ్యారు. అమర్ కూడా ఈ విషయం పై చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. అయినా కూడా ప్రియాంక మోసం ని మర్చిపోయి ఎప్పటిలాగానే ఆమెతో ఉంటున్నాడు.
దీనికి ఇంస్టాగ్రామ్ లో అమర్ దీప్ ఫ్యాన్స్ జరిగిన వీడియో మొత్తాన్ని పోస్ట్ చెయ్యగా, దానిని అమర్ దీప్ భార్య తేజస్విని తన స్టోరీ లో అప్లోడ్ చేసింది. ‘బలంగా నిలబడు..ఇప్పటికైనా మనుషులు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకో’ అని క్యాప్షన్ పెట్టింది. ప్రియాంక బయటకి వచ్చిన తర్వాత కూడా తేజస్విని ఇక మాట్లాడే పరిస్థితి ప్రస్తుతానికి లేనట్టుగానే ఉంది. చూడాలి మరి.