Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండే మన అందరికీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిన అతి తక్కువ మందిలో ఒకరు అమర్ దీప్. ఇతను ‘జానకి కలగనలేదు’ అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత వరుసగా ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మరింత దగ్గరయ్యాడు. ఇతనిలో డ్యాన్స్ టాలెంట్ అద్భుతంగా ఉంది అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.

అలా బయట ఇంత స్ట్రాంగ్ గా అనిపించాడు కాబట్టే అమర్ దీప్ పై బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ అమర్ దీప్ ఆ అంచనాలను అందుకోవడం లో ఫెయిల్ అయ్యాడు. మొదటి 5 వారాల్లో ఆటలు అయితే ఆడాడు కానీ, అన్నీ దొంగాటలే. ఆ తర్వాత నాగార్జున కోటింగ్ ఇవ్వడం తో లైన్ లోకి వచ్చాడు.

గడిచిన మూడు వారాల్లో రెండు వారాలు బాగా ఆడాడు, కానీ మూడవ వారం మళ్ళీ దొంగాట ఆడి దొరికిపోయాడు. మొదటి రౌండ్ లోనే కెప్టెన్సీ కంటెండర్ టాస్కు నుండి తొలగిపోవడం బాగా డల్ అయ్యాడు. ఆ వారం మొత్తానికి అతనికి ఆటలో పాల్గొనే అవకాశం లేకుండా పొయ్యింది. కానీ ఈ వారం మాత్రం అమర్ దీప్ తన విశ్వరూపం చూపించేసాడు అనే చెప్పొచ్చు.

ఆడియన్స్ ఆయన నుండి కోరుకునేది ఇలాంటి ఆటనే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అమర్ దీప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వారం ఆయన ప్రతీ టాస్కులోను విజయం సాధించాడు. కాబట్టి వీకెండ్ లో నాగార్జున నుండి అమర్ దీప్ కి పొగడ్తలు వస్తాయి అనొచ్చు. ఇదే ఊపులో అమర్ దీప్ రాబొయ్యే వారాల్లో కూడా ఆడితే కచ్చితంగా ఆయన టాప్ 2 స్థానాల్లో ఎదో ఒక స్థానం గెలుచుకుంటాడని అంటున్నారు నెటిజెన్స్.
