Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ షో అతి పెద్ద హిట్ కావడానికి కారణం ఎవరు అనే లిస్ట్ తీస్తే అమర్ దీప్ పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఈ షో మొత్తం అతని చుట్టూనే తిరిగింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంత మంది ఎంత టార్గెట్ చేసిన, సోషల్ మీడియా లో తన మీద పీఆర్ టీంలు ఎన్ని తప్పుడు వీడియోలను ప్రచారం చేసినా అమర్ ఫ్యాన్స్ అమర్ దీప్ వెంట బలంగా నిలబడి ఆయనకి ఓట్లు వేశారు.

కానీ అతి తక్కువ ఓట్ల తేడాతో అమర్ దీప్ ఈ సీజన్ రన్నర్ గా నిలవాల్సి వచ్చింది. అదంతా పక్కన పెడితే బయటకి వచ్చిన తర్వాత అమర్ దీప్ కుటుంబం వెళ్తున్న కారుపై దాడులు చెయ్యడం, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు అమర్ మనసుని బాగా గాయపరిచింది. అందుకే హైదరాబాద్ లో ఉండడం ఇష్టం లేక, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వెంటనే అనంతపురం కి వెళ్ళిపోయాడు.

అక్కడ తన అభిమానులు మరియు కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపి మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. కానీ వచ్చిన పక్కరోజే తన భార్య తేజస్విని తో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్ళిపోయాడు. అయితే అమర్ దీప్ ఇంటర్వ్యూస్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రోజుకి 20 మంది యూట్యూబర్స్ అమర్ దీప్ ఇంటికి రావడం, అమర్ ఇంట్లో లేడు అనే విషయం తెలుసుకొని వెనుతిరగడం కామం అయిపోయింది.

అయితే దీనిపై ఆయన స్నేహితుడు నరేష్ లొల్ల ఒక క్లారిటీ ఇచ్చాడు. అమర్ కాస్త మానసిక ప్రశాంతత కోసం తన భార్య తో కలిసి టూర్ కి వెళ్లాడని, వచ్చిన తర్వాత అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలిపాడు. దీంతో అమర్ అభిమానులు ఆయన ఇంటర్వ్యూస్ కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
