Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ వాతావరణం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రశాంత్ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నాడంటే దానికి కారణం అమర్ దీప్ అని చెప్పొచ్చు. అతను టార్గెట్ చేసి రెండవ వారం లో వేసిన నామినేషన్ వెయ్యడం వల్లే ప్రశాంత్ పై జనాల్లో సానుభూతి ఏర్పడింది.
దానికి తోడు రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ కూడా కామన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే గత కొద్దిరోజుల నుండి ప్రశాంత్ మరియు అమర్ దీప్ చాలా స్నేహం గా ఉంటూ వచ్చారు. వీళ్లిద్దరు కలిసిపోతే ఎంత బాగుందో, బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా ఆడుతున్నది వీళ్లిద్దరు మాత్రమే అని జనాల్లో ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది.
ఇదంతా పక్కన పెడితే ఈరోజు జరిగిన నామినేషన్స్ లో మళ్ళీ వీళ్లిద్దరి మధ్య ఒక రేంజ్ లో వాదనలు గొడవలు జరిగాయని అర్థం అవుతుంది. కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోని చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ముందుగా యావర్ తో మాట్లాడుతున్న సమయం లో ప్రశాంత్ ప్రస్తావన వస్తుంది. అప్పుడు అమర్ ‘రేయ్ ప్రశాంత్.. చెప్పురా నువ్వు’ అంటాడు. అప్పుడు ప్రశాంత్ ‘నన్ను రా అని పిలవకు’ అని అంటాడు.
దానికి అమర్ ‘నేను నిన్ను తమ్ముడిలాగానే అనుకున్నాను..అందుకే రా అని పిలుస్తా, పలికితే పలుకు లేకపోతే పో’ అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా ప్రశాంత్ ఆడియన్స్ తో మాట్లాడుతూ ‘చూసారు గా, అమర్ అన్న మొదటి నుండి నా మీద నెగటివిటీ తోనే ఉన్నాడు..ఇక మీరే చూసుకోండి’ అని అంటాడు. అప్పుడు అమర్ దీప్ ‘హా చూడండి, నన్ను బయటకి పంపేసి, వాడికే కప్ ఇచ్చుకోండి’ అని అమర్ దీప్ చాలా సెటైరికల్ గా అంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది నేడు పూర్తి ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది.