Big Boss : బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం వచ్చినప్పుడు హౌస్ మొత్తం హీట్ వాతావరణం లో ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. మామూలుగా కూడా నామినేషన్స్ చేసుకోవచ్చు, కానీ పల్లవి ప్రశాంత్ వంతు వచ్చినప్పుడు మాత్రం అతను మాట్లాడే తీరుకి గొడవలు జరిగిపోతుంటాయి. నిన్న కూడా అదే జరిగింది. ఇక భోలే శవాళీ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నామినేషన్స్ సమయం లో గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇతను హౌస్ లో ఎలాంటి ఆటలు ఆడడు.

కనీసం ఆడే ప్రయత్నం కూడా చెయ్యడు. సీరియల్ బ్యాచ్ మీద నరనరాల్లో ద్వేషం నింపుకొని వచ్చినట్టుగా ఇతని ప్రవర్తన ఉంటుంది. సీరియల్ బ్యాచ్ మీద ఎదురు తిరిగే ప్రతీ ఒక్కరిని అక్కున చేర్చుకునే శివాజీ అండ ఉంటుంది అనే నమ్మకం తో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇతని మీద ఎవరైనా నామినేషన్స్ వెయ్యడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతలా అవహేళన చేస్తాడో మనం గడిచిన రెండు వారాల నుండి చూస్తూనే ఉన్నాం.

ఇకపోతే ఈరోజు జరిగిన నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ మధ్య వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ పాయింట్స్ లేకుండా అమర్ దీప్ శివాజీ మరియు భోలే ని నామినేట్ చేసిన విధానం నచ్చలేదు అంటూ నామినేట్ చేస్తాడు. శివాజీ ని కెప్టెన్సీ టాస్కు నుండి తొలగించడం నచ్చలేదు అంటూ, భోలే శవాళీ అన్న చేసిన త్యాగం కి నామినేట్ చెయ్యడం నచ్చలేదు అంటూ పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తాడు. ఈ విషయం లో వాదనలు తారా స్థాయికి చేరుకుంది. అమర్ దీప్ కి కోపం వస్తే నోరు అదుపులో ఉండదు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.

ప్రశాంత్ మరియు అమర్ మధ్య వాదనలు జరుగుతున్న సమయం లో మధ్యలో గెలకడానికి వచ్చిన భోలే పై మధ్యలో మాట్లాడితే పగిలిపోతాది అని అంటాడు. అలాగే మాట్లాడుతున్న సమయం లో ప్రశాంత్ ని ‘ఆ నా కొడుకు’ అని కూడా సంబోధిస్తాడు. ప్రశాంత్ నామినేషన్ చేసిన పాయింట్స్ బాగాలేవు, దానికి అమర్ ఇచ్చిన సమాదానాలు కూడా సరైనవే. కానీ ఇలా మధ్యలో మాట తూలినప్పుడు, ఆ తూలిన పదాలే జనాలకు గుర్తుకు వస్తాయి. అవతల వ్యక్తి పై సానుభూతి పెరుగుతుంది. అమర్ ఈ చిన్న లాజిక్ ని ఇంకా గుర్తించలేదు. అదే ఆవేశం మళ్ళీ చూపిస్తున్నాడు. ఈ ఆవేశం తో అతను టాప్ 5 లోకి ఎంటర్ అవ్వొచ్చు కానీ, కప్ కొట్టడం మాత్రం అసాధ్యం అనే చెప్పాలి.
