Amala Paul : అప్పుడలా..ఇప్పుడిలా.. పూర్తిగా మారిపోయిన అమలాపాల్..!

- Advertisement -

Amala Paul : టాలీవుడ్ హీరోయిన్ అమలా పాల్, తన భర్త జగత్ దేశాయ్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నిరోజులుగా బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. గతేడాది నవంబర్ లో అమలాపాల్ తన ప్రియుడు గుజరాత్ ప్రాంతానికి చెందిన జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారంటూ ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.

amala paul
amala paul

అప్పట్లో అమలాపాల్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. తాజాగా అమలాపాల్ సీమంతం వేడుకు ఘనంగా జరిగింది. గుజరాత్ లోని సూరత్ లో ఈ వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమలా తన ఇన్ స్టాలో పంచుకుంది. “ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం అమలా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతుండగా.. వీరిద్దరికి నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు. అమలా పాల్ గతంలో డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయిన తర్వాత తిరిగి సినిమాల్లో నటించింది అమలాపాల్. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉండే అమలా.. తన ప్రేమ గురించి బయటపెట్టిన పదిరోజుల్లోనే ప్రియుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. అయితే, ఇటీవల అమలాపాల్ తన భర్తతో కలిసి హాట్ ఫొటోషూట్ పాల్గొన్న సగంతి తెలిసిందే. దానిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇప్పడు ఫొటోలపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here