Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ అయిన తెలుగు హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. మెగా పవర్ స్టార్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ డస్కీ బ్యూటీ గతేడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

నవంబరు 5 వ తారీకున అతడితో కలిసి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లై రెండు నెలలు గడవక ముందే ప్రెగ్రెన్సీ అని ప్రకటించి, అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అమలాపాల్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పలు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ.. తన బేబీ బంప్ పిక్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. ఇకపోతే తాజాగా అమల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలోని జనాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. భర్తతో కలిసి తాజాగా ఫొటో షూట్ చేసింది. హాట్ లుక్స్ తో పిచ్చెక్కించేలా ఉన్న ఆ షూట్ ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.
కొందరేమో పద్దతిగా దిగొచ్చుగా అంటున్నారు. మరికొందరు మాత్రం ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి అమలా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక గతంలో ఓ క్యూట్ బేబీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని.. అమల ‘2 హ్యాపీ కిడ్స్’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో అమలపాల్‌కు కవలలు జన్మించబోతున్నారు, ఈ విధంగా ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చారు. ఇప్పడేమో ఏకంగా బేబి బంప్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఏదైమైనా అమలాపాల్ కు కంగ్రాట్స్ చెబుతూ హ్యాపీ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.