అక్కినేని అమల ఒకప్పుడు నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈమె బయటకు పెద్దగా రావడానికి ఇష్టపడరు తన ఫౌండేషన్ వ్యవహారాలను అలాగే సినిమా షూటింగ్ పనులలో తప్ప ఎక్కువగా ఇంటర్వ్యూలకు, ఇతర ఈవెంట్లలో పాల్గొనడానికి అమల ఏమాత్రం ఆసక్తి చూపించరని చెప్పాలి. ఇలా చాలా తక్కువగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో అక్కినేని హీరో నాగచైతన్యపై అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చైతూని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడటం విశేషం. నాగచైతన్య చాలా తెలివైన వాడట. అతనికి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, ఆ క్లారిటీతో ఉంటాడని తెలిపింది. అమల చాలా వరకు బయటకు రాదు. ఆమె పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌నే ఇష్టపడుతుంటారు. తన ఫౌండేషన్, ఏదైనా అవకాశం వస్తే సినిమాలు మాత్రమే చేస్తారు. కానీ ఆమె నాగచైతన్య గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

నాగచైతన్య అత్యంత తెలివైన వాడని, అత్యంత ధైర్యవంతుడని తెలిపింది. అంతేకాదు కెరీర్ పట్ల, పని పట్ల చాలా ఫోకస్‌గా ఉంటాడట. అతనికి ఏం కావాలో క్లారిటీతో ఉంటాడని, చాలా బ్రిలియంట్ అని చెప్పింది అమల. చైతూని ప్రశంసలతో ముంచెత్తడం ఆశ్చర్యపరుస్తుంది. చైతూ అభిమానులను ఖుషి చేస్తుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలోని వ్యాఖ్యలివి. అమల ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా తన తనయుడు అఖిల్ గురించి కూడా చెప్పింది అమల. అఖిల్‌కి మనుషులంటే ఇష్టమట. పీపుల్ లవ్వింగ్ పర్సన్ అని, మనుషులను ఎక్కువగా ప్రేమిస్తాడని తెలిపింది. అఖిల్ కంటే చైతూనే పొగిడేసరికి అయ్యగారి ఫ్యాన్స్ కాస్త హట్ అవుతున్నారట.