ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్ని నెల నుంచి కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో లాక్ అయిపోయాడు అనే విషయం తెలిసిందే. అయితే అప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్ ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీలకు సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్ గురించి అన్ని భాషల ప్రేక్షకులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

ఇక అల్లు అర్జున్, పూజా హెగ్డే మాత్రం తొలిసారి ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో కలిసి నటించారు. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో పూజా హెగ్డే బికినీలో దర్శనమిచ్చి అభిమానులను కనువిందు చేసింది. అంతేకాదు ఈ సినిమా విజయంలో పూజా హెగ్డే అందాలు కీ రోల్ పోషించాయి. ఆ తర్వాత వీళ్లిద్దరు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో జోడిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.

అయితే ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా అల్లు అర్జున్.. తర్వాత ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు అన్న విషయంపై మాత్రమే ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాలో ఐరన్ లెగ్ హీరోయిన్ కి అవకాశం ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి అని చెప్పాలి. ఇంతకీ అల్లు అర్జున్ అవకాశం ఇవ్వబోయే హీరోయిన్ ఎవరో తెలుసా.. పూజా హెగ్డే. అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక నటీనటుల్లో ఉండే టాలెంట్ ను బట్టి అల్లు అర్జున్ ఎక్కువగా తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం చూస్తూ ఉంటాం.