Allu Sneha : ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సతీమణులలో హీరోయిన్లకు మించిన అందం తో, దివి నుండి భువికి దిగి వచ్చిన దేవత లాగ అనిపించేంత అందం ఉన్నది అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు తనకి తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి.

ఆ ఫోటోలకు మరియు వీడియోలకు లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వస్తూ ఉంటాయి.ఇంస్టాగ్రామ్ లో ఈమెకి ఉన్నంత ఫాలోయింగ్ మరియు రీచ్ మరో స్టార్ హీరోయిన్ కి లేదు.రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో ద్వారా ఆమెకి మొక్కలు అంటే ఎంత ఇష్టమో అర్థం అయ్యింది.

రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో లో ఆమె మాట్లాడుతూ ‘నిజమైన సంతోషం ఏమిటంటే చెట్లు మరియు మొక్కల మధ్య కాసేపు కాలం గడపడమే. వాటిల్ని అలా చూస్తూ, వాటితో కాసేపు మాట్లాడుతూ, వాటికి నీళ్లు పోస్తూ ఉంటే చాలా సంతోషం గా ఉంటుంది.అందుకే నేను ఖాళి సమయాలలో నర్సరీలకు వెళ్తూ ఉంటాను’ అని చెప్పుకొచ్చింది స్నేహా రెడ్డి. ఇవి కాకుండా తన కూతురు అల్లు అర్హ చేసే క్యూట్ అల్లరికి సంబంధించిన వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది స్నేహా.

ఆ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లైక్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సమంత యశోద చిత్రం లో నటించిన అల్లు అర్హ రాబొయ్యే రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలలో కూడా బాలనటిగా మీరబోతున్నట్టు సమాచారం.