Allu Arjun : స్టార్ కిడ్స్ లలో సోషల్ మీడియా లో మంచి ఫేమ్ ఉన్న బుడ్డోడు ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ అని చెప్పొచ్చు. ఇతనికి సోషల్ మీడియా లో ఎలాంటి అకౌంట్స్ లేవు, కానీ అప్పుడప్పుడు అతని తల్లి అల్లు స్నేహా రెడ్డి అప్లోడ్ చేసే ఫోటోలు మరియు వీడియోలలో కనిపిస్తూ ఉంటాడు. వాటిల్లో అందరూ ఒక మూడ్ లో ఉంటే, అల్లు అయాన్ మాత్రం మరో మూడ్ లో ఉంటాడు.

ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, వీడియోస్ అందరి చూపుని తనవైపుకు తిప్పుకునేలా అల్లరి చెయ్యడం వంటివి అల్లు అయాన్ కి సర్వసాధారణం. అయితే రీసెంట్ గా అల్లు అయాన్ తల్లి అల్లు స్నేహ రెడ్డి హైదరాబాద్ లో ఒక ‘ఫైర్ ఫ్లై కార్నివాల్’ అనే సంస్థ ని ప్రారంభించింది. చిన్న పిల్లల కోసం ప్రారంభించిన ఈ సంస్థ ఈమధ్యనే హైదరాబాద్ లో మొదలైంది.

ఈ ‘ఫైర్ ఫ్లై కార్నివాల్’ చిన్న పిల్లలకు ఒక సరికొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. వాళ్లకు సంబంధించిన షాపింగ్, ఎంటర్టైన్మెంట్ గేమ్స్,ఇష్టమైన ఆహరం, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఉంటాయి. ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని స్నేహ రెడ్డి తన చెల్లెలు తో కలిసి స్థాపించింది. దీని ఓపెనింగ్ కి ఆమె తన భర్త అల్లు అర్జున్ తో పాటుగా, అల్లు అయాన్ మరియు అల్లు అర్హ తో పాటుగా, కొంతమంది పిల్లలతో కలిసి వచ్చింది.

అల్లు అయాన్ ఆ పిల్లల గుంపుతో కలిసి ఉన్నాడు. అయితే తన తండ్రి అల్లు అర్జున్ ని కలవడానికి పరిగెట్టుకుందు ముందుకు రాగ, అల్లు అర్జున్ బాడీ గార్డ్ అల్లు అయాన్ ని ఎవరో అనుకొని పక్కకి నెట్టే ప్రయత్నం చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.