Allu Arjun : దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం నడుస్తోంది. నేడు దేశంలో నాలుగో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం పై సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అధికారికంగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఇప్పుడే కాకుండా భవిష్యతులో కూడా తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని పొలిటికల్ ఎంట్రీ పై స్టైలిష్ స్టార్ బన్నీ కుండబద్దలు కొట్టారు. కాగా, సోమవారం అల్లు అర్జున్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై స్టైలిష్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తనకు సన్నిహితులైన వారికి మద్దతు మాత్రమే ఇస్తానన్నారు. ఇందులో భాగంగానే వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ ఇచ్చానని క్లారిటీ ఇచ్చారు.
గత ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని కలవడం కుదరలేదన్నారు. అందుకే ఈ సారి ఇంటికి వెళ్లి కలిశానంటూ నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, బన్నీవాసు, తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలకు తన మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. ఇక, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని అల్లు అర్జున్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నాలుగో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.