టాలీవుడ్ లో టాలెంట్ కి మారుపేరు లాగ ఉండే హీరోల లిస్ట్ తీస్తే అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్, తన సొంత కష్టం తోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నిట్లోనూ తన సత్తా చూపించి సినిమా కంటెంట్ ఎలా ఉన్నా, కేవలం అల్లు అర్జున్ కోసం సినిమాని చూడొచ్చు అని అనిపించేలా చేస్తాడు.
అందుకే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వస్తుంటాయి. కేవలం తెలుగు సినిమాలతోనే ఇతర రాష్ట్రాల్లో క్రేజ్ ని సంపాదించుకున్న అల్లు అర్జున్, పుష్ప సినిమా తో పాన్ ఇండియన్ లెవెల్ లో బాక్స్ ఆఫీస్ ని దున్నేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రం పార్ట్ 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది.
ఇంత టాలెంట్ ఉన్న అల్లు అర్జున్ ఒకసారి తన సినిమా ప్రొమోషన్స్ కోసం ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చాడు. అక్కడ కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత తమ ఛానల్ ని చూడాల్సిందిగా కాస్త మీ నోటితో ప్రచారం చేస్తారా అని యాంకర్ అడుగుతుంది. అప్పుడు అల్లు అర్జున్ తప్పకుండా చేస్తాను,ఏమి చెప్పాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు యాంకర్ చెప్పిన లైన్స్ ని కంఠస్తం చెయ్యడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఆ సమయం లో అల్లు అర్జున్ ని చూసిన ఎవరికైనా అసలు ఇతనికి తెలుగు వచ్చా ? అనే సందేహం మొదలు అవుతుంది. చిన్న డైలాగ్ పలకడానికే అల్లు అర్జున్ అన్ని టేకులు తీసుకుంటే, ఇక సినిమాలో అంత పెద్ద డైలాగ్స్ పలకడానికి ఇంకెన్ని టేక్స్ తీసుకున్నాడో అని అప్పట్లో అందరూ అనుకున్నారు. అలా ఆ యాంకర్ కారణంగా ఆరోజు అల్లు అర్జున్ పరువు పోయింది.