Allu Arjun : కొత్త టాలెంట్ ని ప్రోత్సహించే విషయం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ ముందు ఉంటాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ సూపర్ స్టార్, ఆయన సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు బాలీవుడ్,కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తారు. పుష్ప సినిమా తో ఆయనకీ జనాల్లో ఏర్పడిన ఇమేజ్ అలాంటిది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన ‘పుష్ప : ది రూల్’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కొత్త దర్శకులను కూడా ప్రోత్సహించేందుకు సిద్ధం గా ఉన్నాడట. ఈ ఏడాది ‘బలగం’ అనే చిత్రం తో కమెడియన్ వేణు దర్శకుడిగా మారి ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడా మన అందరికీ తెలిసిందే.

ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తర్వాత వేణు కి టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. రీసెంట్ గానే న్యాచురల్ స్టార్ నాని ని కలిసి ఒక కథ కూడా వినిపించాడట. నాని కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వేణు తనతో అల్లు అర్జున్ కి ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘బలగం సినిమా చూసి అల్లు అర్జున్ గారు నన్ను ఎంతో మెచ్చుకున్నారు. మంచి కథ ఉంటే కచ్చితంగా నీతో సినిమా చేస్తా అని కూడా మాట ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చాడు వేణు. గతం లో రుద్రమదేవి చిత్రం లో కూడా అల్లు అర్జున్ పాత్ర కి డైలాగ్స్ అందించాడట వేణు. ఈ చిత్రం లోని అల్లు అర్జున్ డైలాగ్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే.