టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గజగజ వణికే కాంబినేషన్స్ లో ఒకటి అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్, జులాయి సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి కాంబినేషన్, ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మరియు ‘అలా వైకుంఠపురం లో’ వరకు కొనసాగింది. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్టే కానీ , ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసి ఆల్ టైం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నామని రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రం జానర్ జానపద తరహాలో ఉంటుందని ఒక ప్రచారం సాగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తుంది. మహాభారతం లోని పాత్రలను ఆదర్శంగా తీసుకొని, ఈ చిత్రం కథ అల్లాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.

గతం లో ఇలాగే మహాభారతం పాత్రలను ఆదారంగా తీసుకొని సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు మమ్మూటీ కాంబినేషన్ లో ‘దళపతి’ అనే సినిమా తీసాడు. ఈ సినిమా అప్పట్లో తెలుగు మరియు తమిళం బాషలలో సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమా కూడా ఇదే తరహా లో ఉంటుందట.

ఇందులో అల్లు అర్జున్ తో పాటుగా ఒక సీనియర్ హీరో కూడా నటించే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి పాత సినిమాలను ఆధారంగా తీసుకొని చిత్రాలను తెరకెక్కించే అలవాటు ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ , ఈసారి కూడా అదే పని చేయబోతున్నాడా?, లేదా తనలోని కొత్త కోణాన్ని చూపిస్తాడా అనేది చూడాలి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ మొత్తం ‘పుష్ప ది రూల్’ మీదనే ఉంది. ఈ సినిమా పూర్తి అయినా తర్వాతే ఆయన తదుపరి ఏ చిత్రం చెయ్యాలి అనేది ఆలోచిస్తాడట.