టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక లో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. వాటిల్లో ‘అలా వైకుంఠపురం లో’ అనే చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి, ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది, ఈ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా దాటలేదు అంటే అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పటి నుండి ఆయన సినిమాలు తీస్తే ఏదైనా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలి. ‘పుష్ప ది రూల్’ తర్వాత ఆయన ఎవరూ అందుకొని రేంజ్ కి వెళ్తాడు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ కొత్త సినిమా అనే వార్త అభిమానులకు ఇష్టమే, కానీ త్రివిక్రమ్ కేవలం ప్రాంతీయ బాషా చిత్రాలకు మాత్రమే దర్శకుడు కదా, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ తో సినిమా ఎలా తీస్తాడు అని అందరికీ అనుమానం రావొచ్చు. పైగా హ్యాట్రిక్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉంటాయి, వాటిని అందుకోవడం సాధారణమైన విషయం కాదని త్రివిక్రమ్ కి కూడా తెలుసు.
అందుకే ఈసారి పాన్ ఇండియన్ సబ్జెక్టు తో మన ముందుకి రాబోతున్నాడు అట, ఇది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ చిత్రం గా ఉంటుందని సమాచారం. సుమారుగా 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో, ఇండియా లో ఉన్న ప్రముఖ పాన్ ఇండియన్ స్టార్స్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారు అట. చిరంజీవి కెరీర్ లో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రం ఎలా అయితే ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిల్చిందో, ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో అనబోతుందని టాక్.