బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తర్వాత 15 ఏళ్లకే హీరోయిన్ గా మారిన నటి హన్సిక. హృతిక్ రోషన్ మొదటి సినిమా ‘కోయి మిల్ గయా’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ద్వారా వెండితెర కి పరిచయమైనా హన్సిక మోత్వానీ , ఆ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘దేశ ముదురు’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది.

ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అప్పట్లోనే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఆరోజుల్లో ఈ సినిమాలోని పాటలు ఒక ఊపు ఊపాయి. ఇప్పటికీ కూడా ఆ పాటలను మనం వింటూనే ఉన్నాం, అంత ఫేమస్ అయ్యాయి ఆ పాటలు. ఈ చిత్రం తర్వాత హన్సిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు మరియు తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ ని సంపాదించి అనతి కాలం లోనే సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. అయితే ఈమెకి ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలతో మంచి సన్నిహిత సంబంధం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే, వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. ఆయనతో దేశముదురు సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి హన్సిక గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను దేశముదురు సినిమా షూటింగ్ చేస్తున్న సమయం లో నాకు 15 సంవత్సరాలు నిండి , 16 వ సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నాను. నా పుట్టినరోజు అనే విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాథ్ నన్ను బలవంతంగా పబ్ కి లాక్కొని వెళ్లారు. అక్కడ వేడి వేడి పాలు నా గొంతులో పోశారు, అనంతరం ఏవేవో ఇచ్చారు అప్పట్లో నాకు పబ్ అంటే ఏంటో తెలియదు. అదే మొట్టమొదటిసారి, నాకు పబ్ ని అలవాటు చేసింది అల్లు అర్జునే’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.