Pawan Kalyan, అల్లు అర్జు్న్ లను కలపబోతున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

- Advertisement -

Pawan Kalyan : ముఖ్యంగా సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు వారి పై నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. తెలిసో, తెలియకో వారు చేసిన చిన్న పని అయినా ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు నంద్యాల వెళ్లారు. సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు. ఇది జనసేన కార్యకర్తలు పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

Allu arjun pawan kalyan
Allu arjun pawan kalyan

పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ నుంచి భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రకంగా ఆయన సినిమా మీద నెగిటివ్ కామెంట్లు వచ్చే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో అల్లు అర్జున్ సపోర్టు చేసిన వ్యక్తి ఓడిపోవడంతో పవన్ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా మరోసారి పవన్ కళ్యాణ్‌ను కలిసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా అగ్ర నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లినపుడు వారిలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మరోసారి వైసీపీ తరఫున క్యాంపెనింగ్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి మరోసారి వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ ను నిరూపించాలని చూస్తున్నారట. చూడాలి మరి అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్‌ను కలిస్తే ఆయన అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here