Pushpa2 : ఇది పుష్ప గాడి రేంజ్.. అడుపెట్టాడో రికార్డులు బద్దలవ్వాల్సిందే

- Advertisement -

Pushpa2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. పుష్ప మూవీ పెట్టుబడి కంటే రెండితలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజెంట్ ఎక్కడ విన్నా పుష్ప గురించిన ముచ్చట్లే. పుష్ప 2 సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన పుష్ప కంటే త్వరలో రాబోతున్న సీక్వెల్ పై కాస్త ఎక్కువ బజ్ ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా అంచనాలను భారీగా పెంచాయి. మొన్న రిలీజ్ అయిన పుష్ప పుష్ప అంటూ సాగే టైటిల్ సాంగ్ మాత్రం రికార్డులను బ్రేక్ చేస్తుంది. యూట్యూబ్ లో అరుదైన రికార్డును సాధించింది.

ఈ ప్రాజెక్ట్‌ని ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రమేకర్స్ రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కి అరుదైన ప్రత్యేకతను అందుకుంది. సాంగ్ విడుదలైన ఆరు భాషల్లో మొదటి 24 గంటల్లో దేశంలో అత్యధికంగా వీక్షించబడిన లిరికల్ సాంగ్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది. 40 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని దక్కించుకుంది. తాజాగా పుష్ప సాంగ్ రిలీజయిన 24 గంటల్లో యూట్యూబ్ లో సాధించిన రికార్డులని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

పుష్ప మొదటి సాంగ్ తోనే వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు విజయ్ పోలంకి.. పాటకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇది మంచి బ్రేక్ ను ఇచ్చింది. ఒక్క పాటకే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది థియేటర్లు బద్దలవ్వడం పక్కా అని బన్నీ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here