Allu Arjun : టాలీవుడ్ లో ఒక పాత్ర కోసం ఎంత కష్టమైన పడేందుకు సిద్ధమయ్యే హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సినిమా కంటెంట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చి ఫ్యాన్స్ ని కాలర్ ఎగరవేసుకునేలా చేసే హీరోలలో ఒకడు ఆయన. అందుకే చిన్న స్థాయి హీరో నుండి అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన కేవలం తెలుగు ఆడియన్స్ కి సంబంధించిన హీరో మాత్రమే కాదు.

అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ మరియు మాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత ఇతర రాష్ట్రాల్లో రాజమౌళి తర్వాత అతి పెద్ద బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకుంది ఒక్క అల్లు అర్జున్ మాత్రమే. ఇదంతా పక్కన పెడితే ఆయన ఎంత కష్టపడతాడు అనేందుకు ఉదాహరణగా ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి.

ఇక అసలు విషయానికి వస్తే అల్లు అర్జున్ ని స్టార్ గా మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. ఈ సినిమాలో ‘తెలుసా..తెలుసా..ప్రేమించానని’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ పాట కేవలం ఆడియో పరంగా మాత్రమే కాదు, విజువల్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలోని లొకేషన్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేయలేదట, అంత ప్రమాదకరమైన చోటు అట. అక్కడ షూటింగ్ చెయ్యడం ప్రమాదం అని తెలిసి కూడా అల్లు అర్జున్ ఏమాత్రం తగ్గకుండా అక్కడే చేస్తానని పట్టుబట్టి మరీ పది రోజుల పాటు ఆ లొకేషన్ లో షూట్ చేశారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.