Allu Arjun : చాలా కాలం నుండి మీడియా లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య సరైన సఖ్యత లేదు అనే వార్త, కథనాలు జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సరైనోడు చిత్రానికి ముందు అల్లు అర్జున్ వేరు, సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్ వేరు, అప్పట్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లను తన సినిమాల కోసం వాడుకునేవాడు, కాస్త స్టార్ స్టేటస్ రాగానే ముందు పవన్ కళ్యాణ్ ని, ఆ తర్వాత మెల్లగా చిరంజీవి పేరు తప్పించి, అల్లు ఫ్యామిలీ మరియు మెగా ఫ్యామిలీ అంటూ రెండుగా విభజించే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నాడు, అందుకు కావాల్సిన ఏ సందర్భం వచ్చినా అతను ఉపయోగించుకుంటున్నారని మెగా అభిమానుల అభిప్రాయం. ఉదాహరణకు నంద్యాల సంఘటనని తీసుకోవచ్చు. ఎన్నికల ప్రచారం ముగిసే రోజున అల్లు అర్జున్ వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లి మద్దతు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

నువ్వు వస్తే నీకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా అల్లు అర్జున్ వినిపించుకోకుండా పనిగట్టుకొని మరీ నంద్యాల కి వెళ్లి జనసేన పార్టీ కి పరోక్షంగా నష్టం చేసే ప్రయత్నం చేశాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అదే రోజు రామ్ చరణ్ పిఠాపురం కి వెళ్లి పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సంఘటన ని దారి మరలించే ప్రయత్నం కోసమే అల్లు అర్జున్ ఇలా అవసరం లేకపోయినా వెళ్ళదంటూ ఆరోపణలు సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా లో తనపై ఇంత నెగటివిటీ వస్తుందని, మెగా అభిమానులు తనని అపార్థం చేసుకుంటారని అల్లు అర్జున్ కి ముందే తెలుసు. కచ్చితంగా మనసులో ఆయనకీ పవన్ కళ్యాణ్ మీద ఎదో తెలియని అసంతృప్తి ఉంది.
నిన్న ఆయన అనుచరుడు బన్నీ వాసు ని ఇదే ప్రశ్నని అడగగా అతని ముఖ కవళికలు, తడబాటు చూస్తే అందరికీ అర్థం అయిపోతుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త ఏమిటంటే రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తించారని, కానీ తనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తించలేదని, అది తనని ఎంతో బాధించిందని, అందుకే తనకి ఇష్టమొచ్చిన పని చేశాను అంటూ అల్లు అర్జున్ ఇండస్ట్రీ లో కొంతమంది సన్నిహితుల ముందు మాట్లాడినట్టు తెలుస్తుంది.ఈ కారణం చేతనే మనసులో పెట్టుకొని సరైన సమయం వచ్చినప్పుడు అల్లు అర్జున్ అలా నంద్యాల కి వెళ్లాడని తెలుస్తుంది. వాస్తవానికి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభినందించాడు, అంతే కాకుండా అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ‘జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ప్రత్యేకంగా ట్వీట్ కూడా వేసాడు. అయినప్పటికీ అల్లు అర్జున్ లో ఇంత అసంతృప్తి ఉండడం గమనార్హం అని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు.