అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను త్వరలోనే విడుదల చేయాలి అనే ఆలోచనతో చిత్ర బృందం ఉంది. మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కు హైదరాబాద్ లో అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఏఏఏ అనే పేరుతో ఒక మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ హైదరాబాదులో తీసుకొని వచ్చారు. ఈ థియేటర్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఎల్ఈడి స్క్రీన్ ఉన్న థియేటర్ ఇదే. దీనిని ఎంతో గ్రాండ్ గా ఓపెన్ చేశారు.
అల్లు అర్జున్ కున్న మరొక బిజినెస్ బఫెలో వైల్డ్ వింగ్స్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఈ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుండటంతో చాలామంది అక్కడికి వస్తున్నారు. ఇది చాలా రద్దీగా ఉండే ఏరియా. ఆ రెస్టారెంట్ విపరీతమైన వ్యాపారాన్ని ఆకర్షిస్తోంది. అల్లు అర్జున్ తాతయ్య అయిన అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు అర్జున్ , అల్లు స్టూడియోను ఈ మధ్యకాలంలో నిర్మించారు. ఈ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా, షూటింగులు కూడా జరుగుతాయి. ఈ అల్లు స్టూడియో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంది.
అర్జున్ చేస్తున్న మరొక వ్యాపారం ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా వచ్చి కొద్ది రోజుల్లోనే మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ను అల్లు అర్జున్ చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఆహా ప్లాట్ ఫామ్ నందు తెలుగు వెబ్ సిరీస్ లు ,మరియు సినిమాలను చూడవచ్చు. రీజనల్ ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఆహా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇవే కాకుండా అల్లు అర్జున్ కు ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు. అన్నింటి ద్వారా ఆయనకు ప్రతినెల కోట్లలోనే ఆదాయం వస్తుందని సమాచారం.