Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన పుష్ప చిత్రం కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే కాదు, ఆ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫేమ్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుండి చివరి వరకు అల్లు అర్జున్ కి అసిస్టెంట్ ఉండే కేశవ పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో మనమంతా చూసాము.

ఈ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ పేరు జగదీశ్. ఇతను రీసెంట్ గానే తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం లో, ఇతగాడిని అనుమానితుడిగా భావించి అరెస్ట్ చేసారు. ఈ వార్త ఫిలిం నగర్ లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకొని ఇండస్ట్రీ లో అవకాశాలను సంపాదించుకుంటున్న జగదీశ్ ఇలాంటి కేసు లో చిక్కుకోవడం అనేది ఆయన కెరీర్ కి పెద్ద మైనస్ అనే చెప్పాలి.

ఇది ఇలా ఉండగా పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేశవ క్యారక్టర్ కచ్చితంగా పుష్ప తో కలిసి సమానమైన స్క్రీన్ స్పేస్ తో ప్రారంభం నుండి చివరికి ఉంటుంది. ఇప్పటి వరకు షూట్ చేసిన కంటెంట్ మొత్తం లో కేశవ క్యారక్టర్ ఉంది, ఇక ముందు తియ్యబోయే కంటెంట్ లో కూడా కేశవ పాత్ర ఎక్కువ ఉంటుంది.

కాబట్టి ఇప్పుడు జగదీశ్ ని జైలు నుండి బయటకి తీసుకొని రావడం పుష్ప టీం కి అత్యవసరం. అందుకే అవసరం మూవీ టీం కి ఉంది కాబట్టి జగదీశ్ ని బెయిల్ మీద బయటకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ అయితే తన సొంత డబ్బులతో 15 లక్షల రూపాయిలు ఖర్చు చేసి అయినా పర్వాలేదు, జగదీశ్ కి బెయిల్ రప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడట. మరి జగదీశ్ బయటకి వస్తాడో లేదో చూడాలి.