Allu Arjun కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘వరుడు’.అప్పట్లో హీరోయిన్ ని సస్పెన్స్ పెట్టడం, ట్రైలర్ వంటివి అద్భుతంగా ఉండడం వల్ల ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు.అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కూడా ఇదే.అయితే సినిమాలో కథా బలం లేకపోవడం తో ఎన్ని హంగులు దిద్దినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఫలితంగా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.డైరెక్టర్ గుణ శేఖర్ కెరీర్ కూడా ఈ సినిమా తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయింది.అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన కోలుకోలేదు.మధ్యలో ‘రుద్రమదేవి’ అనే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.పెద్ద హీరోలు ఆయనతో సినిమాలు చెయ్యడానికి ఆసక్తి చూపలేదు.

అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన భానుశ్రీ మెహతా కి అవకాశాలే రాలేదు.చిన్న చిన్న పాత్రలకు మాత్రమే ఆమె కెరీర్ పరిమితమైంది.కానీ సోషల్ మీడియా లో మాత్రం తరుచూ యాక్టీవ్ గానే ఉంటుంది ఈమె.అయితే ఈరోజు ఈమె కాసేపటి క్రితమే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేసాడు అంటూ ఒక ట్వీట్ వేసింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను అల్లు అర్జున్ తో కలిసి అప్పట్లో వరుడు సినిమాలో నటించాను, మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాను అని నేను అనుకుంటున్నాను.ఆ సినిమా అప్పట్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో నాకు అవకాశాలు రాలేదు.నేను కెరీర్ లో ఎన్నో కష్టనష్టాలను పడ్డాను, కానీ వాటిల్లో కూడా నేను వినోదం ని వెతుక్కున్నాను, కానీ ఇక్కడ చూడండి అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేసాడు.నేను ఏనాడు కూడా ఆయనని ఒక్క మాట కూడా అనలేదు.అయినా కూడా నన్ను బ్లాక్ చేసాడు ఎందుకో’ అంటూ చెప్పుకొచ్చింది భానుశ్రీ మెహ్రా.మరి ఈ ట్వీట్ చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.
If you ever feel like you’re stuck in a rut, just remember that I acted in Varudu with Allu Arjun and STILL couldn’t get any work. But I’ve learned to find humor in my struggles – especially now that Allu Arjun has blocked me on Twitter🤷♀️ Go subscribe ?https://t.co/mqX2lVNjwx pic.twitter.com/ycSR5yGpfl
— Bhanushree Mehra (@IAmBhanuShree) March 18, 2023