Lavanya tripati : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరి ప్రేమ గురించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ప్రచారంలో ఉందికానీ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఏకంగా ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి మొదటి సినిమా సమయంలో మంచి తెలుగబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలంటూ అల్లు అరవింద్ సలహా ఇచ్చిన వీడియో వెరలైంది. తాజాగా ఈ వీడియోమీద అల్లు అరవింద్ స్పందించారు.

తాజాగా జరిగిన ‘బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య పై ఫన్నీ కామెంట్స్ చేశారు. కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన యాంకర్ అల్లు అరవింద్ ను హీరోయిన్ పాత్ర గురించి చెప్పాలని కోరింది. ఈ సినిమాను స్ఫూర్తి గా తీసుకొని పెళ్లి చేసుకోవద్దు అంటూ వైష్ణవి చైతన్య కు సలహా ఇచ్చారు. వైష్ణవికి ఇంకా మంచి భవిష్యత్ ఉందని, కెరీర్ లో సెటిలైన తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేయాలని సూచించారు. తన బ్యానర్ లో ఓ హీరోయిన్ మూడు సినిమాలు చేసిందని, ఆ అమ్మాయిని ఇక్కడే మంచి తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తే మా వాడినే లవ్ చేసిందన్నారు. వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జులై 14 న బేబీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు.

ఠాగూర్ సినిమా నిర్మాత మధుతో కలిసి రామాయణం చిత్రం తీయాలనే యోచనలో అల్లు అరవింద్ ఉన్నారు. మూడు నిర్మాణ సంస్థలు ఈ చిత్రంలో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక లావణ్య త్రిపాఠి-కార్తికేయ కాంబోలో చావు కబురు చల్లగా మూవీ తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ… ఎక్కడో నార్త్ ఇండియా నుండి వచ్చి తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడుతున్నావు. ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో సరిపోతుంది, అన్నారు. అల్లు అరవింద్ మాటలకు లావణ్య గట్టిగా నవ్వేసింది. కట్ చేస్తే అది జరిగిన రెండేళ్లకు ఆయన ఫ్యామిలీకే చెందిన వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరుపుకుంది.