Rocking Rakesh : ఆది, ఆర్పీ పై మండిపడ్డ రాకింగ్ రాకేష్.. ఒకప్పుడు అంతా రోజా కాళ్ల మీద పడ్డవాళ్లే

- Advertisement -

Rocking Rakesh : సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు విడదీయ రాని బంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రచారంలో పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జబర్దస్త్ కమెడియన్స్ ఈ కూడా పాల్గొని జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ ఎన్నికల్లో జబర్దస్త్ జడ్జి, సీనియర్ హీరోయిన్ రోజా కూడా వైసీపీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో కమెడియన్స్ కు రోజాకు పలుసార్లు మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

ఆమె ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆమెపై పలువురు కమెడియన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ రోజాను టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ రోజాకు మద్దతు పలుకుతూనే .. హైపర్ ఆదికి, కిర్రాక్ ఆర్పీకి ఇచ్చిపడేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకింగ్ రాకేష్.. ‘‘ రోజా నాకు అమ్మతో సమానం. ఆమెను అలాగే పిలుస్తాను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారు. నాతో పాటు చాలా మందికి ఆమె సాయం చేశారు. నా చేతుల ద్వారా కూడా ఎంతోమందికి ఆమె మేలు చేశారో నాకు తెలుసు.

- Advertisement -

ఎవరైనా ఆపదలో ఉండి ఆమె కాళ్ల మీద పడితే వెంటనే సాయం చేసేవారు. ఆమె ఆస్తులు అమ్మి కూడా డబ్బు సాయం చేశారు. అలాంటి రోజా అమ్మను విమర్శించే వారిని వారి వ్యక్తిత్వానికే వదిలేద్దాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం వాళ్లు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు. వ్యక్తిత్వం వ్యక్తులే ముఖ్యం రోజాపై కామెంట్స్ చేసిన వారికి ఇది ఎప్పుడు అర్థం అవుతుందో’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాకింగ్ రాకేష్ కామెంట్స్.. వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన వారు తోటి కమెడియన్ అయినా ఇచ్చిపడేశాడుగా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here