Aila Bhatt.. డైరెక్టర్ మహేశ్ భట్ కూతురిగా బాలీవుడ్ లో అడుగుపెట్టినా తండ్రిని మించిన తనయగా తన టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమా మాత్రమే నెపొటిజమ్ తో వచ్చిన ఛాన్స్ అని.. ఆ తర్వాత తన టాలెంట్ తో వచ్చిన అవకాశాలేనని ప్రూవ్ చేసింది. వర్సటైల్ సినిమాలు ఎంచుకుంటూ తన తోటి హీరోయిన్ల కంటే తాను చాలా డిఫరెంట్ అని నిరూపించింది.

లవ్ స్టోరీస్, హీరోయిన్ ఓరియెంటెడ్, క్రైమ్ థ్రిల్లర్స్, పేట్రియాటిక్, సోషియో ఫాంటసీస్, మెసేజ్ ఓరియంటెడ్.. ఇలా జానర్ ఏదైనా వన్స్ ఆలియా స్టెప్ ఇన్ బాక్సాఫీస్ హిట్ అవ్వాల్సిందే. సినిమా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అలా తన టాలెంట్ తో ఆలియా హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి హాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సాధించిన టాలీవుడ్ వండర్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ లోనూ ఆలియా భట్ నటించింది.
ఇంతటి టాలెంటెడ్ నటి తాజాగా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’ (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు) జాబితాలో ఆలియా చోటు దక్కించుకుంది. గతేడాది ఈ జాబితాలో సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి, షారుక్‌ఖాన్‌లు మాత్రమే చోటు దక్కించుకోగా.. ఈ సంవత్సరం అలియా ఉండడంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ విషయం తెలుసుకున్న హాలీవుడ్ దర్శకుడు టామ్ హార్పర్ ఆలియా టాలెంట్ ను ప్రశంసించారు. ‘‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమా కోసం అలియాను మొదటిసారి కలిశాను. ఈ చిత్రంతో ఆమెను హాలీవుడ్‌కు పరిచయం చేశాను. పెద్ద హీరోయిన్ అయినప్పటికీ సెట్లో చాలా సరదాగా ఉండేది. సన్నివేశం బాగా రావడం కోసం రిస్క్ తీసుకోవడానికి కూడా వెనుకాడదు. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించింది. ప్రతీ సన్నివేశానికి తనదైన శైలిలో మెరుగులు దిద్దుతుంది. ఆమె నిజంగా ఇంటర్నేషనల్ స్టార్’’ అని ప్రశంసించారు.
ఇక ఆలియా ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’లో నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు జిగ్రా అనే ఇంకో చిత్రంలోనూ నటిస్తోంది. ఇంకోవైపు తన బ్యానర్ లో సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేస్తోంది ఆలియా.