Pushpa 2 : పుష్ప మూవీకే హైలెట్ గా ఐటెం సాంగ్ నిలిచింది. పుష్ప సక్సెస్ లో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ పాటకు కూడా భాగం ఉంది. ఈ పాటలో ఎన్నడూ చూడని విధంగా సమంతన చూపించాడు డైరెక్టర్ సుకుమార్. చిన్న స్కర్ట్, బ్లౌజ్ తో ఈ పాటలో సమంత సెగలు పుట్టించింది. అల్లు అర్జున్ తో ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు పిచ్చెక్కిపోయారు.

ఈ సాంగ్ చేసే నాటికి సమంత డివోర్స్ తీసుకుంది. ఐటెం సాంగ్ చేయడం సరికాదని అందరూ చెప్పినా.. నాగచైతన్య పైన కోపంతో మరించ రెచ్చిపోయింది సమంత. పుష్ప పార్ట్ వన్ లో ఐటెం సాంగ్ హైలెట్ గా నిలవగా.. పార్ట్ 2 లో ఐటెం సాంగ్ ఉంటుందా? ఉండదా? ఉంటేఎవరు చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే సమంతనే మళ్లీ తీసుకుంటే మూవీలో ఫ్రెష్ నెస్ ఉండని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి టైంలో పుష్ప- 2 కోసం చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని పరిశీలించారట సుకుమార్. బాలీవుడ్ బ్యూటీ ఆలియాను సుకుమార్ అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ఆలియా భట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే.. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇప్పటికే తెలుగు ఫ్యాన్స్ కు ఆలియాభట్ సుపరిచితమే. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర చిత్రంలో ఆలియా నటించాల్సి ఉండగా.. అది కుదర్లేదు. ఇక పుష్ప చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా కాగా.. అనసూయ, సునీల్. ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.