Alekhya Reddy : నందమూరి తారకరత్న ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. లోకేష్ యువగళం పాదయాత్ర లో పాల్గొన్న ఆయన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు..అప్పటి నుంచి 23 రోజుల పాటు ఆసుపత్రి లో ప్రాణాలతో పోరాడి చివరకు ఫిబ్రవరి 18 న ప్రాణాలను విడిచారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన అన్నీ ఉన్నా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతి చిన్న మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు.. తారకరత్న మరణాన్ని అయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఊహించుకోలేకుంది..

ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త భౌతికంగా లేకపోవడంతో మానసికంగా క్రుంగిపోతుంది.. భర్తతో గడిపిన ప్రతి క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది.. వాటిని చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.. తాజాగా ఆమె మరో ఫోటోను పోస్ట్ చేసింది.. తారకరత్న, భార్య అలేఖ్య రెడ్డి పిల్లలు కలిసి చివరిగా తిరుమలకు వెళ్లిన ఫోటోను అభిమానులతో పంచుకొని ఎమోషనల్ అయ్యింది… ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.. దానికి అలేఖ్య రాసిన క్యాప్షన్ చూస్తే గుండె తరుక్కుపోతుంది..

ఇదే మన చివరి ఫోటో అంటే నమ్మలేక పోతున్నా.. నీ మరణం ఒక కల అయితే బాగుండు.. నువ్వు బంగారం అని పిలిస్తే వినాలనుంది.. ప్లీస్ నాకోసం మళ్ళీ తిరిగిరావా.. ఇక ఇక నిన్ను విడిచి పెట్టను.. నువ్వు నాకు కావలి అంటూ కన్నీరు పెట్టుకుంది.. ఆమె మాటలు విన్న నందమూరి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ గుండె ధైర్యం చేసుకోవాలని చెబుతున్నారు.. పోయిన వాళ్ళను తిరిగి తీసుకొస్తే శక్తీ దేవుడికే లేదు.. పిల్లలల్లో తారకరత్నను చూసుకొని, వారే ప్రపంచంగా బ్రతకాలనీ చెబుతున్నట్లు తెలుస్తుంది.. ఇక తారకరత్న పెద్ద కర్మ గురువారం నిర్వహించనున్నారు.. ఆ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం..