Katrina Kaif : బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రీనా కైఫ్ కు గురించి చెప్పాల్సిన పనిలేదు. తాను టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఒకప్పుడు వెంకటేష్ తో మల్లీశ్వరి, బాలయ్యతో అల్లరి పిడుగు లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాల్లో అమ్మడి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తరువాత బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం బీటౌన్ సెన్సేషనల్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. సినీ ఇండస్ట్రీలోనే ది పవర్ఫుల్ హీరోయిన్‌గా క్రేజ్ ను దక్కించుకుంది.
ఇక 2003లో బూమ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సక్సెస్ సాధించకపోయిన తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో బాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. 2005లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన మైనే ప్యార్ తూనే కియాతో మంచి సక్సెస్ అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తర్వాత ఈమె కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. అయితే సినిమాలే కాకుండా మరోపక్క ఇండియన్ టాప్ బ్రాండ్స్ అన్నిటికీ అంబాసిడర్ గా కూడా పనిచేసింది. అలాగే బిజినెస్ రంగంలోనూ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఇక 2023లో పెప్సికోకు చెందిన మామిడికాయ జ్యూస్ స్లైస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.
అయితే తర్వాత ఏవో కారణాలతో స్లైస్ ఎండాస్మెంట్ డీల్ కోల్పోవడంతో ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. లాక్మీ, ఎల్వి లోంరియల్ లాంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లతో ఆమె క్రేజ్ సంపాదించుకున్నా.. స్లైస్ బ్రాండ్‌కు ఆమె ప్రధాన అంబాసిడర్ గా ఉండేది. కానీ స్లైస్ నుంచి కత్రినా తప్పుకోవడంతో ఆమె స్థానంలో కియారా అద్వానీ వచ్చి చేరింది. స్లైస్ యాడ్ కియారాకు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం ఈ ప్రకటనలో నయనతార నటిస్తోంది. ఇందులో ఆమె ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే కియారా అద్వానీ, కత్రీనా ప్లేస్ లోకి రావడం.. కత్రీనా ఈ డిల్ కోల్పోవడంతో ఆమెకు దాదాపు రూ.6 నుంచి 7 కోట్ల వరకు వచ్చే రెమ్యునరేషన్ కోల్పోయిందట. కానీ ఇప్పుడు స్లైస్ తో అనుబంధం మిస్ అవ్వడంతో ఆమెకు అంత డబ్బు నష్టపోయినట్లైంది.