Akkineni Nageshwara Rao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరికీ నటనలో ఓనమాలు దిద్దించిన హీరోలలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు. మన తెలుగు సినిమా ఆయనతోనే ప్రారంభం అయ్యింది. అంతే కాదు ఇండస్ట్రీ మొత్తం చెన్నై లో ఉన్న సమయం లో, హైదరాబాద్ లోని ఎత్తైన కొండల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించిన ధైర్యశాలి ఏఎన్నార్. ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అక్కినేని నాగేశ్వర రావు గారే.

అలాంటి లెజెండ్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుని, సుమారుగా మూడు దశాబ్దాలు టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ ఇస్తున్నాడు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్రాళ్లకు మించిన అందం తో మన్మధుడు అని అనిపించుకుంటున్నాడు.

అయితే అక్కినేని కుటుంబం లో నాగార్జున తర్వాత అంతగా ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు అనే చెప్పాలి. మధ్యలో సుమంత్ ఇండస్ట్రీ లోకి వచ్చాడు, రెండు మూడు హిట్ సినిమాలు తీసి స్థిరపడ్డాడు కానీ, అదే రేంజ్ ని కొనసాగించలేకపోయాడు. మధ్యలో ఆయనకీ వరుసగా ఫ్లాప్స్ రావడం తో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆ సమయం లో కెరీర్ ని ఎటు తీసుకెళ్లాలి అనే డైలమా లో పడి బాగా నిరాశకి గురి అయినా సమయం లో సుమంత్ కి అక్కినేని నాగేశ్వర రావు గారు జూబ్లీ హిల్స్ లోని ఏఎన్నార్ సెంటర్ ని రాసి ఇచ్చేశాడట.

దీని విలువ ఇప్పుడు వందల కోట్ల రూపాయిలు ఉంటుంది. అంతే కాకుండా తన అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఒక భాగం సుమంత్ కి రాసి ఇచ్చేశాడట. అలా దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల ఆస్తులను సుమంత్ పేరిట నాగేశ్వర రావు గారు రాశారట. అలా రాసినందుకు నాగార్జున కూడా ఫైర్ అయ్యినట్టు అప్పట్లో ఒక వార్త వినిపించింది. ఎవరు ఏమనుకున్నా లెక్క చెయ్యకుండా తాను చెయ్యాలనుకున్న పనిని చేసేసాడు.