తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిన్నటి తరం స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున టాప్ 3 హీరోల లిస్ట్ లో కచ్చితంగా ఉంటాడు. అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, మొదటి సినిమా నుండి తన సొంత అడుగుజాడల్లో నడుస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా ఎదిగిపోయాడు.టాలీవుడ్ మాస్ , క్లాస్ , డివోషనల్, ఫ్యామిలీ , కామెడీ ఇలా అన్నీ జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో అక్కినేని నాగార్జున మాత్రమే.

ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన నాగార్జున వాటితోనే సక్సెస్ లు అందుకున్నాడు కూడా. అయితే ఇప్పుడు ఆ ప్రయోగాలే ఆయన పాలిట శాపం లాగ మారాయి. వరుసగా ప్రయోగాలు చేసి, అవి అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో నాగార్జున మార్కెట్ మొత్తం పోయింది. అందుకే ఈసారి ఆచి తూచి అడుగులు వెయ్యాలని చూస్తున్నాడు.

ఈసారి ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సరైన కథ కోసం ఎదురు చూసాడు. ధమాకా చిత్రానికి కథ ని అందించిన ప్రసన్న కుమార్ , దర్శకుడిగా మారి నాగార్జున తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యాడు. నాగార్జున కూడా అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ, కథలో కొన్ని మార్పులు చెయ్యమని సూచించాడు. చేసిన తర్వాత కూడా నచ్చకపోవడం తో ఆ సినిమాని ఆపేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సరైన కమర్షియల్ కథ దొరికే వరకు సినిమాలు చెయ్యకుండా అయినా ఉంటాను కానీ, సరైన కమర్షియల్ సినిమా లేకుండా రాను అని డైరెక్టర్స్ కి చెప్తున్నాడట. ఒకకవేళ అలాంటి కథ దొరకకపోతే సినిమాల నుండి శాశ్వతంగా తప్పుకోడానికి కూడా వెనుకాడడు అట. నాగార్జున లో చాలా కాలం తర్వాత ఇంత కసి చూడడం తో అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళ సంతోషాన్ని రెట్టింపు చేసే బ్లాక్ బస్టర్ ని నాగార్జున కొడుతాడో లేదో చూడాలి.