Akkineni Nagarjuna : నాకు వాటిపై అవగాహన లేదని చెప్పి ఉన్న పరువంతా తీసేసుకున్న నాగార్జున..

- Advertisement -

Akkineni Nagarjuna : ‘విక్రమ్’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు నాగార్జున. ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాగార్జున యువ టాలెంట్‌ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా నాగార్జున తెలుగు ఫిలిం ఇండస్ట్టీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 70వ దశకంలో ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు నాగార్జున. అయితే ఇప్పటికి కూడా తనకు టెక్నికల్‌గా అవగాహన లేదని అన్నపూర్ణ స్టూడియో టీం తనను గైడ్‌ చేస్తుందన్నారు. తాజాగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

భారతీయ సినిమా పరిశ్రమకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గుండె కాయలాంటిది అన్నారు. దేశం మొత్తం మీద సినిమాలు ఎంత కలెక్షన్‌ వసూలు చేస్తాయో.. అంతే వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో వస్తాయన్నారు నాగార్జున. టెక్నికల్‌గా రోజు రోజుకు ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. సంవత్సరం కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. అయితే నాగార్జున తనకైతే టెక్నికల్‌గా పెద్దగా అవగాహన లేదని వీఎఫ్‌ఎక్స్‌ గురించి ఏం మాట్లాడాలో తెలియదన్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియో టెక్నికల్‌ టీం తనను ఎప్పుడూ గైడ్‌ చేస్తుంటారని తెలిపారు.

హైదరాబాద్‌ తో అక్కినేని కుటుంబానికి ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ ఉందని గత జ్ఙాపకాలను గుర్తు చేసుకున్నారు నాగ్‌. 1974 లో దివంగత అక్కినేని నాగేశ్వర్‌ రావు హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించినప్పుడు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో స్టూడియోలో నెలకు ఒక్క సినిమా షూటింగ్‌ జరిగినా చాలు అనుకునే పరిస్థితులు ఉండేవన్నారు. ఎన్నో కష్టాలు పడి సినిమా పరిశ్రమను హైదరాబాద్‌లో నిలబెట్టామన్నారు నాగార్జున.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here