Akkineni Amala : ఇన్నేళ్ల తర్వాత నాగార్జునతో గొడవ పెట్టుకున్న అమల.. అందుకు కూడా రెడీయేనట

- Advertisement -


Akkineni Amala : టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్స్ జాబితాలో అక్కినేని నాగార్జున, అమల జోడీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో బాక్సాఫీస్‌ షేక్ చేసిన శివతో పాటు చాలా చిత్రాల్లో జంటగా నటించారు. అయితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకుంది ఈ జంట. అయితే పెళ్లి తర్వాత అమల సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రం ద్వారా అమ్మ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో శర్వానంద్‌కు తల్లిగా నటించింది. ఇలా కేవలం కొన్ని సెలెక్టివ్‌గా సినిమాలు మాత్రమే చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అమల తొలిసారిగా రాజేందర్ దర్శకత్వం వహించిన మైథిలి ఎనై కథలి అనే తమిళ చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్‌హిట్ కావడంతో 1987 లో విడుదలైన పుష్పక విమానంలో కమల్ హాసన్‌ సరసన అమల కీలక పాత్ర పోషించింది. అంతే కాకుండా 1991 మలయాళ చిత్రం ఉలడక్కమ్‌లో తన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

Akkineni Amala

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా జంటలు, పెళ్లయిన కొద్ది రోజులకే విడాకుల బాట పడుతున్నారు. కానీ వారందరికీ విరుద్ధంగా ఈ జంట ఇప్పటికి ఎంతో ప్రేమగా మెలుగుతూ వస్తున్నారు. అయితే ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమల వారి దాంపత్య జీవితంలో సాధారణంగా జరిగిన గొడవల గురించి తెలిపింది. అమల మాట్లాడుతూ.. ‘భార్యాభర్తలు అన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం కామన్. నేను ఏదైనా చేయాలనుకుంటే .. మొదలు పెట్టక ముందే నేను అది చేయలేనేమో అనే అనుమానంతో ఉంటాను.

దీంతో వెంటనే మళ్లీ మొదలు పెట్టావా నువ్వు.. ఏమైనా చేయగలవు.. నువ్వు మొదట చేయడానికి ప్రయత్నించు అంటూ నాగార్జున చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఈ ఆర్గ్యుమెంట్ లోనే మా ఇద్దరి మధ్య గొడవ మొదలవుతాయి. ఇక ఏ గొడవ జరిగినా కూడా అది పూర్తిగా సాల్వ్ చేసుకోకుండా నిద్రపోవడానికి వీల్లేదు. పడుకునే లోపే ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం. నేను ఏం అడిగినా కూడా నాగార్జున ఇప్పటి వరకు నో చెప్పింది లేదు. నా కోరిక తీర్చేంత వరకు నాగార్జున దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అందరి భర్తల్లాగే నా భర్త కూడా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తూ.. ఎక్కువ ప్రేమిస్తాడు’ అంటూ చాల ప్రౌడ్ గా చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here